కనిగిరి: పామూరులో స్వచ్ఛ పదం కార్యక్రమం పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎంపీడీవో బ్రహ్మయ్య
పామూరు పట్టణంలో ప్రతి బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛపదం కార్యక్రమం పై అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని ఎంపీడీవో బ్రహ్మయ్య నిర్వహించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి నాయకులు కొండిశెట్టి వెంకట రమణయ్య మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని, మన ఇళ్ళను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో, అదేవిధంగా పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛపదం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.