కనిగిరి: పట్టణంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన పృధ్విరాజ్ నివాసంలో ఏసీబీ అధికారుల దాడులు
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డిప్యూటీ తహసిల్దారుగా పనిచేస్తున్న పృధ్విరాజ్ ఓ రైతు నుండి రూ. 25000లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు సోమవారం పట్టుబడిన విషయం తెలిసిందే. పృథ్వి రాజ్ నుండి రూ. 25000లు స్వాధీనం చేసుకున్న అధికారులు , ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో పృథ్వీరాజ్ నివాసంలో కూడా ఏసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పృధ్విరాజ్ కు సంబంధించిన పలు కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.