కనిగిరి: పట్టణంలోని మంచినీటి దొరువు అభివృద్ధి పనులను పరిశీలించిన కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని మంచినీటి దొరువు అభివృద్ధి పనులను ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా దరువులో పూడికతీత పనులు, రిబిట్ మెంట్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలం వచ్చేలోపు దరువు పూడికతీత, రిబిట్మెంట్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు షేక్ ఫిరోజ్, అధికారులు పాల్గొన్నారు.