కనిగిరి: పామూరులో శ్రీ మదన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా పూర్ణాహుతి హోమం
పామూరు పట్టణంలో కొలువైన శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత శ్రీ మదన వేణుగోపాలస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా పూర్ణాహుతి హోమ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు పూర్ణాహుతి హోమ కార్యక్రమంలో పాల్గొని స్వామిని స్మరించుకుంటూ పూజలు చేశారు. అనంతరం స్వామివారికి విశేష పూజలు, అర్చనలు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు పండితులు ఆశీర్వచనాలు అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.