కనిగిరి: పట్టణంలో డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలి: కనిగిరి మున్సిపల్ కమిషనర్ శ్రీధర్
కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీ, బీసీ కాలనీలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా శివనగర్ కాలనీ, బీసీ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం పనులను కమిషనర్ పరిశీలించారు. డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులను నాణ్యతగా చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను కమిషనర్ ఆదేశించారు. ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి సహకారంతో కనిగిరి మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. అందులో భాగంగానే డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.