కొత్తగూడెం: ఖమ్మం సాగర్ ఆయకట్టు రైతులకు శుభవార్త: విడుదలైన గోదావరి జలాలు
ఖమ్మం జిల్లా సాగర్ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోకుండా, సీతారామ ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను విడుదల చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు.