కనిగిరి: హనుమంతునిపాడు తహసిల్దార్ కార్యాలయంలో ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత
హనుమంతునిపాడు లో మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనలు కార్యక్రమంలో భాగంగా స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో రెవెన్యూ సమస్యల పరిష్కార వేదికను నిర్వహించిన కలెక్టర్... స్థానిక ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని, సంబంధిత శాఖల అధికారులు పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ తెలిపారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, ఆర్డిఓ అజయ్ కుమార్ పాల్గొన్నారు.