కనిగిరి: ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం : కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు కనిగిరి ఎమ్మెల్యే మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కనిగిరి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి తరలివచ్చిన ప్రజల నుండి ఎమ్మెల్యే వినతి పత్రాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుండి స్వీకరించిన వినతి పత్రాలను సంబంధిత శాఖల అధికారులకు పంపించి, వారి సమస్యలు త్వరత గతిన పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటామని అన్నారు.