సంతనూతలపాడు: మద్దిపాడు మండలం లింగంగుంటలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిషోరీ వికాసం 2026 పై కౌమార దశలోని బాలికలకు అవగాహన కార్యక్రమం
మద్దిపాడు మండలం లింగం గుంట గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బుధవారం కిషోర్ వికాసం 2026 కార్యక్రమం పై స్థానిక అంగన్వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ జి పద్మావతి మాట్లాడుతూ.... 11 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల లోపు కౌమార దశలోని బాలికలను ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. బాల్యవివాహాల వల్ల కలిగే అనర్ధాలను వివరించి, 18 ఏళ్ల లోపు బాలికలకు ఎట్టి పరిస్థితుల్లో వివాహాలు జరిపించవద్దని తల్లిదండ్రులకు సూచించారు. బాల్య వివాహాలు జరిపిస్తే జరిగే పరిణామాలు, శిక్షలు గురించి వివరించారు.