రాప్తాడు: సజ్జల కాలువ వద్ద దళితుల అందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద కురుకుంట రవి నాగభూషణం డిమాండ్
అనంతపురం జిల్లా కేంద్రంలో అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో కురుగుంట రవి బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కురుకుంట రవి నాగభూషణం మాట్లాడుతూ సజ్జల కాలువ వద్ద ఏడెకరాల ప్రభుత్వ భూములు చిన్నంపల్లి కురుగుంట చుట్టుపక్కల గ్రామంలో 150 మంది దళితులకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బంది ఎదుర్కొంటున్నారని వారందరికీ కూడా సజ్జల కాలువ వద్ద ఇళ్ల స్థలాలు కేటాయించాలని కురుకుంట రవి బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం తదితరులు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చిన్నంపల్లి కురుగుంట దళితులంతా పాల్గొన్నారు.