సంతనూతలపాడు: సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద నలుగురు అంతర్జాతీయ దొంగలను అరెస్టు చేసిన పోలీసులు
సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద నలుగురు అంతర్జాతీయ దొంగలను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇటీవల ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగిలించిన i-10 కారును చేధించిన పోలీసులు నలుగురు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, 4 ద్విచక్ర వాహనాలు, ఒక మొబైల్ ఫోన్, రూ.50 వేల నగదు కలిపి సుమారు రూ.8 లక్షల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ హర్షవర్ధన్ రాజు పర్యవేక్షణలో ప్రత్యేక పోలీసు బృందాలు పేర్నమిట్ట వద్ద నిందితులను అరెస్టు చేశారు. ప్రత్యేక బృందం పేర్నమిట్ట వద్ద నిందితులను పట్టుకుంది.