ఉరవకొండ: యలగలవంక వద్ద కల్వర్ట్ క్రింద నీటి కుంటలో వ్యక్తి మృతదేహం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం యలగలవంక గ్రామానికి చెందిన హరిజన కేశన్న (40) మంగళవారం ఇంటి నుండి వెళ్ళిపోయి అదృశ్యమైన వ్యక్తి శుక్రవారం సాయంత్రం గ్రామ సమీపంలోని కల్వర్టు క్రింద గుంతలో మృతదేహమై తేలాడు. మేకలు పశువుల కాపరులు కల్వర్టు క్రింద దుర్వాసనను గమనించి గుర్తుతెలియని మృతదేహం అంటూ గ్రామస్తులకు సమాచారం అందివ్వడంతో గ్రామస్తులు, మృతుని కుటుంబ సభ్యులు కలసి మృతదేహాన్ని హరిజన కేశన్నగా గుర్తించారు. మృతునికి భార్య మౌనిక ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై బెలుగుప్ప పోలీసులకు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు.