పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల మేరకు పొదిలి మండల వైయస్సార్ పార్టీ అధ్యక్షుడు గుజ్జల సంజీవరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ రాష్ట్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. క్రమశిక్షణ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వెల్లడించింది.