సంతనూతలపాడు: పేదల కష్టాలు తెలిసిన మహోన్నత నాయకుడు దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి: సంతనూతలపాడు వైసిపి ఇన్చార్జి, మాజీమంత్రి నాగార్జున
సంతనూతలపాడు నియోజకవర్గంలోని చీమకుర్తి, మద్దిపాడు మండలం ఏడు గుండ్లపాడు లో దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ 77వ జయంతి కార్యక్రమాన్ని సంతనూతలపాడు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ విగ్రహాలకు వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి నాగార్జున పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పేదల కష్టాలు తెలిసిన మాజీ సీఎం వైయస్సార్, వారికి సంక్షేమ పథకాలు అందించి, వారి హృదయాల్లో జరగని ముద్ర వేశారని కొనియాడారు.