రాప్తాడు: కురుగుంటలో ఎమ్మార్పీఎస్ 32వ వార్షికోత్సవం ఎంఆర్పిఎస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని కురుగుంట వద్ద మంగళవారం సాయంత్రం నాలుగు గంటల 20 నిమిషాల సమయంలో ఎంఆర్పిఎస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బిసిఆర్ దాస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 32వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాస్ మాట్లాడుతూ ఎంఆర్పిఎస్ 32వ వార్షికోత్సవ కార్యక్రమం మంద కృష్ణ మాదిగ 61వ పుట్టినరోజు నిర్వహించడం జరిగిందని మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ వల్ల జరిగే ఉపయోగాలు గురించి విలేజ్ కార్యక్రమాన్ని కూడా 40 రోజులు పాటు నిర్వహించడం జరిగిందని భవిష్యత్తులో దళితుల అభివృద్ధికి ఎప్పుడూ ఎంఆర్పిఎస్ పాటుపడుతుందని ఎంఆర్పిఎస్ బి సి ఆర్ దాస్ పేర్కొన్నారు.