ధర్పల్లి: నిజామాబాద్: ప్రేమించిన యువతి మోసం, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మరియ తండాలో ప్రేమ విఫలమై బాణోత్ విజయ్ (22) అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను ప్రేమించిన యువతి వేరొకరిని వివాహం చేసుకుంటున్నందుకు మనస్తాపం చెంది, చనిపోయే ముందు సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి తన ఆవేదనను వెల్లడించాడు.