నిజామాబాద్ రూరల్: నీటి వృధా జరిగితే కఠిన చర్యలు: ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుల నీటి నిల్వలపై సమీక్ష జరిపి, నీటి వృధాను అరికట్టాలని, మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సూచించారు.