కనిగిరి: చంద్రశేఖరపురం చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో చోరీ,3 పంచలోహ విగ్రహాలను దోచుకెళ్లిన దొంగలు
చంద్రశేఖరపురం: ఆలయంలో దొంగలు పడి మూడు విలువైన పంచలోహ విగ్రహాలను దోచుకెళ్లిన సంఘటన చంద్రశేఖరపురంలో బుధవారం వెలుగు చూసింది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురంలోని శ్రీ చంద్రమౌలేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి దొంగలు పడి మూడు పంచలోహ విగ్రహాలను దోచుకెళ్ళారు. ఆలయ పూజారి బుధవారం ఆలయం తెరిచి చూసేసరికి విగ్రహాలు చోరీకి గురైన విషయాన్ని గమనించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న పామూరు సిఐ వినోద్ కుమార్, ఎస్సై వెంకటేశ్వర రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.