కనిగిరి: పట్టణంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయం: కనిగిరి మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్
కనిగిరి పట్టణంలోని ఒంగోలు బస్టాండ్ సెంటర్ నందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కనిగిరి మాజీ శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గురువారం కనిగిరిలోని మాజీ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా అంబేద్కర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులను మాజీ ఎమ్మెల్యే అభినందించి అంబేద్కర్ విగ్రహానికి తన వంతు సహకారంగా రూ. లక్ష విరాళాన్ని వారికి అందజేశారు.