కనిగిరి: ఉపాధ్యాయుల సమస్యలపై యుటిఎఫ్ పోరాటం చేస్తుంది: వెలిగండ్లలో మార్కాపురం జిల్లా యూటీఎఫ్ అధ్యక్షులు ఖాజా రహంతుల్లా
వెలిగండ్ల: మార్కాపురం జిల్లాలో యుటిఎఫ్ బలోపేతానికి ఉపాధ్యాయుల కృషి చేయాలని యుటిఎఫ్ మార్కాపురం జిల్లా అధ్యక్షులు షేక్ ఖాజా రహమతుల్లా కోరారు. సోమవారం వెలిగండ్ల మండలంలో యుటిఎఫ్ నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వెలిగండ్లలోని ప్రభుత్వ పాఠశాలలో యుటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఖాజారహంతుల్లా మాట్లాడుతూ... ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న ఏకైక ఉపాధ్యాయ సంస్థ యుటిఎఫ్ మాత్రమేనని అన్నారు. ప్రతి మండలంలో యుటిఎఫ్ బలోపేతానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.