కనిగిరి: చంద్రశేఖరపురంలో పోలీసుల కార్డెన్ సెర్చ్, సరైన ధ్రువపత్రాలు లేని 23 బైకులు, రెండు ఆటోలు సీజ్
చంద్రశేఖరపురం లోని శివారు కాలనీలలో ఆదివారం పామూరు సీఐ వినోద్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానితుల ఇళ్లలో పోలీసులు స్వాధాలు చేపట్టారు. ఎటువంటి ధ్రువపత్రాలు లేని 23 బైకులను మరియు రెండు ఆటోలను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం సిఐ వినోద్ మాట్లాడుతూ... నిషేధిత గంజాయి విక్రయాలు కొనసాగించినా, వాటిని అక్రమంగా నిలవవించిన కఠిన చర్యలు తీసుకుంటామని, సత్ప్రవర్తనతో మెలగాలని స్థానికులకు సూచించారు.