కనిగిరి: పట్టణంలో మే 10న జరిగే హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయాలి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలో మే 10వ తేదీన నిర్వహించే హనుమాన్ శోభాయాత్రను జయప్రదం చేయాలని కనిగిరి శాసనసభ్యులు మరియు ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు. కనిగిరిలోని టిడిపి కార్యాలయంలో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన పోస్టర్లను మరియు స్టిక్కర్లను ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి హనుమాన్ శోభాయాత్ర కమిటీ సభ్యులతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హనుమాన్ శోభాయాత్ర కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం లాగా కాకుండా, హిందువుల ఆత్మగౌరవానికి ప్రతికగా నిర్వహించాలన్నారు.