ఉరవకొండ: పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో హంస వాహనంపై విహరించిన స్వామి
అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం స్వామివారు హంస వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కనుల పండువగా జరిగిన కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.