సంతనూతలపాడు: అగ్రహారం రహదారిపై బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలు, ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలింపు
చీమకుర్తి: మోటార్ బైక్ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఇద్దరికీ తీవ్ర గాయాలైన సంఘటన చీమకుర్తి మండలం అగ్రహారం రహదారిలో గురువారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చీమకుర్తి మండలం అగ్రహారం రహదారిపై ఒక్కసారిగా బైక్ అదుపుతప్ప ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న ఇద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో, వెంటనే స్పందించిన స్థానికులు 108 అంబులెన్స్ లో ఒంగోలు రిమ్స్ వైద్యశాలకు తరలించారు.