కొండపి: తిరుమల లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేసిన వైసీపీ నేతలను ఆ దేవుడు కూడా క్షమించడు: జనసేన నాయకులు
తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించిన వైసీపీ నాయకులను ఆ దేవుడు కూడా క్షమించడని జనసేన నాయకులు వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఒంగోలు పట్టణంలోని జనసేన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన జనసేన నాయకులు.. ఇకమీదటైనా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వైసిపి నాయకులకు హితవు పలికారు. 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన మీకు ఇంకా బుద్ధి రాలేదని సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. తిరుమలలో ఎంతో ఆదాయం ఉందని అటువంటిది జంతువుల కొవ్వుతో లడ్డు తయారు చేయాల్సిన అవసరం కల్తీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని జనసేన నాయకులు ప్రశ్నించార