ఉరవకొండ: బెళుగుప్ప లో కురిసిన భారీ వర్షం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం బారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పైగా కురిసిన భారీ వర్షానికి వీధులన్నీ జలమయం అయ్యాయి. బెలుగుప్ప మండల తహసిల్దార్ అనిల్ కుమార్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రాత్రి నుంచి రేపు ఉదయం 8 గంటల్లోపు మీ జిల్లా లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని , మండలంలో సైతం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని బహిరంగ ప్రదేశాల్లో ఉండకండిని, దయచేసి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకోండిని వాట్సాప్ గ్రూపుల ద్వారా గ్రామస్థాయి రెవిన్యూ అధికారుల ద్వారా మండల ప్రజలను అప్రమత్తం చేశారు.