కనిగిరి: పట్టణంలోని ఎనిమిదవ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లకు నేరుగా వెళ్లిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి వారికి పెన్షన్ నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో పెన్షన్ నగదును భారీగా పెంచి అందజేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఎమ్మెల్యే అన్నారు. పెన్షన్లు పొందిన లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, పట్టణ టిడిపి అధ్యక్షులు ఫిరోజ్ పాల్గొన్నారు.