కనిగిరి: హనుమంతునిపాడు నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజ్ కుమార్
హనుమంతునిపాడు మండల నూతన ఎస్సైగా రాజ్ కుమార్ ఆదివారం ఉద్యోగ బాధ్యతలను చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని పలువురు సిబ్బంది నూతన ఎస్సై రాజకుమార్ ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఎస్సై రాజ్ కుమార్ మాట్లాడుతూ... హనుమంతునిపాడు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేస్తామని, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు తీసుకునే చర్యలకు మండల ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఎస్సై కోరారు.