రాప్తాడు: చిన్మయ నగర్ లో శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ 70వ పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవ చేసే వారిని సన్మానం చేసిన ఉపకులపతి సుదర్శన్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో చిన్మయ నగర్ లో బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు శ్రీశ్రీ రవిశంకర్ జి 70 పుట్టినరోజు సందర్భంగా సమాజ సేవ చేసే వారిని ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా జెఎన్టియు ఉపకులపతి సుదర్శన్ రావు మాట్లాడుతూ హాట్సాఫ్ లివింగ్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ రవి శంకర్ జి 70 పుట్టినరోజు సందర్భంగా సమాజంలో సేవ చేస్తున్న వారిని గుర్తించి వారిని ఘనంగా సన్మానం చేయడం జరిగిందని అదే విధంగా శ్రీ శ్రీ రవి శంకర్ జి సమాజంలో యోగా ధ్యానంపై ఎన్నో ప్రసంగాల ద్వారా ప్రజలకు సేవ చేయడం జరిగిందని ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఉపకులపతి సుదర్శన్ రావు తెలిపారు.