కనిగిరి: టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడును విధుల నుండి తొలగించాలి: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్
కనిగిరి: తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తిస్తున్న టిటిడి చైర్మన్ డిఆర్ నాయుడు కు మంచి బుద్ధి ప్రసాదించాలని కనిగిరి పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ మరియు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు శనివారం పూజలు చేశారు అనంతరం వైసిపి ఇన్చార్జ్ నారాయణ యాదవ్ మాట్లాడుతూ.... ఇటీవల టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా టిటిడి చైర్మన్ బి ఆర్ నాయుడు అనేతిక వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న అన్నారు. టిటిడి పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఆయనను విధులనుండి తక్షణం తొలగించాలని డిమాండ్ చేశారు.