కనిగిరి: పామూరు మండలం బొట్లగూడూరులో కత్తితో వ్యక్తిపై దాడి, తీవ్ర గాయాలు
పామూరు: వ్యక్తిపై కత్తితో దాడి చేయడంతో తీవ్ర గాయాలైన సంఘటన పామూరు మండలం బొట్లగూడూరు గ్రామంలో ఆదివారం వెలుగు చూసింది.నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లికి చెందిన శివ అనే వ్యక్తి మండలంలోని వేంపాడులో జరుగుతున్న తిరుణాలకు బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యంలోని బొట్లగూడూరు వద్ద కూల్ డ్రింక్ షాప్ వద్ద ఆగగా అక్కడ వేణుగోపాల్ అనే వ్యక్తితో గొడవైంది. అది కాస్తా పెద్దది కాగా వేణుగోపాల్ పక్కనే ఉన్న కొబ్బరి బొండాల కత్తితో శివ పై దాడి చేశాడు. పామూరులో ప్రథమ చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించారు. SI ఆనూక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..