కనిగిరి: పట్టణంలో మే నెల 8వ తేదీన నిర్వహించే జాబ్ మేళా ను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మెల్యే ఉగ్ర నరసింహ రెడ్డి
కనిగిరి పట్టణంలోని అమరావతి గ్రౌండ్ నందు మే నెల 8వ తేదీన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం కనిగిరిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులతో కలిసి జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. జాబ్ మేళా సందర్భంగా నిర్వహించే ఇంటర్వ్యూలలో ఎంపికైన వారికి రూ.12500 నుండి రూ.21,000 లు జీతం లభిస్తుందన్నారు.