రాప్తాడు: నంద్యాలలో జులై 19న బహుజనల ఉద్యోగ న్యాయభేరిని విజయవంతం చేయండి అనంతపురంలో రాప్తాడు ఆర్ పి ఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు పిలుపు
అనంతపురం జిల్లా కేంద్రంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 4గంటల సమయంలో ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో నంద్యాలలో నిర్వహించే బహుజనుల ఉద్యోగుల న్యాయభేరి కరపత్రాలను వాల్ పోస్టులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాప్తాడు ఆర్పిఎస్ వ్యవస్థాపకుడు నాగరాజు మాట్లాడుతూ బహుజనల ఉద్యోగుల ఆధ్వర్యంలో జూలై 19 నంద్యాల్లో న్యాయభేరి సమావేశం నిర్వహించబోతున్నామని ఈ సమావేశంలో మేధావులు ఉద్యోగులంతా పాల్గొని బహుజనుల న్యాయభేరి సభను విజయవంతం చేయాలని రాప్తాడు ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు నాగరాజు పిలుపునిచ్చారు, ఈ కార్యక్రమంలో ఆర్ పి ఎస్ ఉద్యోగ సంఘం నాయకులంతా పాల్గొన్నారు.