రాప్తాడు: యాదవ విద్యార్థిని అభివృద్ధి కోసం యాదవ సంఘం ఎప్పుడు సహకారం అందిస్తుంది అనంతపురంలో యాదవ ట్రస్ట్ చైర్మన్ నాగరాజు యాదవ్
అనంతపురం జిల్లా కేంద్రంలో నక్క రామారావు యాదవ భవనంలో బుధవారం 12:30 నుంచి మూడున్నర గంటల వరకు నిర్వహించిన ప్రతిభ పురస్కరణ కార్యక్రమంలో రాప్తాడు నాగరాజ ముఖ్యఅతిథిగా హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా నక్క రామారావు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ నాగరాజు యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్ తదితరులు మాట్లాడుతూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న యాదవ విద్యార్థినిలను 160 మందిని గుర్తించి వారందరికీ ప్రతిభ పురస్కారాలను నగుదు బహుమతిని అందజేయడం జరిగిందని భవిష్యత్తులో యాదవ విద్యార్థుల అభివృద్ధికి యాదవ కులం ఎప్పుడూ సహకారం అందిస్తుందని యాదవ సంఘం నేతలు పేర్కొన్నారు.