కనిగిరి: పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద ఈనెల 16న పొగాకు రైతుల కోసం దీక్ష: కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఈ నెల 16న పొగాకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరుతూ పొగాకు దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కనిగిరి నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి దద్దాల నారాయణ యాదవ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కనిగిరి నియోజకవర్గంలో 135 పంచాయతీలు ఉంటే అందులో 75 పంచాయతీల్లో రైతులు పొగాకును పండిస్తున్నారు అన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వారి పక్షాన నిర్వహించే దీక్ష కార్యక్రమానికి కనిగిరి నియోజకవర్గం లోని రైతులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు.