నిజామాబాద్ నార్త్: నిజామాబాద్ ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ భవేష్ మిశ్రా
నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ భవేష్ మిశ్రా తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీల్ తెరిచి ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రిని పరిశీలించారు. సీసీ కెమెరాలు నిరంతరం పనిచేయాలని, ఈవీఎంల భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.