రాయదుర్గం: టిడిపి రెండేళ్ల పాలనపై పట్టణంలో కదంతొక్కిన వైసిపి శ్రేణులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీ నిరసనకు దిగారు. రాయదుర్గం పట్టణంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మెట్టు గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వేలాది మంది కార్యకర్తలు లక్ష్మీ బజార్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. వినాయక కూడలి వద్ద గంటపాటు బైఠాయించి ధర్నా చేశారు. ఈ నిరసనతో ట్రాఫిక్ స్తంభించింది. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్నికల తర్వాత వాటిని పూర్తిగా విస్మరించారని నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. వైసిపి నాయ