రాప్తాడు: నేమకలులో సాయి బాలాజీ స్పాంజ్ ఫ్యాక్టరీ యజమానులు కర్ణాటక నుంచి ఖనిజాన్ని తరలిస్తున్నారు బహుజన సమాజ్ పార్టీ నాగరాజ్
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేట వద్ద శనివారం ఐదున్నర గంటల సమయంలో రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ నేమకల్లు వద్ద సాయి బాలాజీ స్పాంజ్ ఫ్యాక్టరీ భారత ప్రభుత్వ ఖనిజ అభివృద్ధి సంస్థ చెందిన గనుల నుంచి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని తరలించుకుంటూ వేలాది రూపాయలు దోచుకుంటున్నారని కర్ణాటకలో కేసులు నమోదు చేసిన ఆంధ్రాలో ఒక కేసు కూడా నమోదు కాలేదని ఇలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని బహుజన పార్టీ నాగరాజ్ డిమాండ్ చేశారు.