ఖైరతాబాద్: రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తాం : సోమాజిగూడలో ప్రజా చైతన్య పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోలెద్దూ శంకర్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రజా చైతన్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బొలెద్దు శంకర్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు ఇంకా కనీస సౌకర్యాల కోసం బాధపడటం దురదృష్టకరమని అన్నారు. గ్రామీణ స్థాయిలో పార్టీ బలోపేతంతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించి అభ్యర్థులను గెలిపిస్తామని వెల్లడించారు.