సైబరాబాద్లో Arrive Alive 2026 కార్యక్రమం మరింత వేగం పుంజుకుంది. రోడ్డు భద్రతపై మిషన్ మోడ్ కార్యాచరణకు నాంది పలుకుతూ Arrive Alive 2026 టేబుల్ టాప్ క్యాలెండర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా సైబరాబాద్ సీపీ డా. ఎం. రమేశ్, జాయింట్ సీపీ డా. గజరావు భూపాల్ను ప్రతినిధులు కలిశారు. ట్రాఫిక్ ఉల్లంఘనలపై నిఘాకు ఉపయోగపడే AI ఆధారిత ట్రాఫిక్ లా కంప్లయన్స్ వాహనాన్ని సీపీ స్వయంగా పరీక్షించారు.