రాప్తాడు: పంపునూరులో 14 కోట్ల 20 లక్షల రూపాయలతో శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపునూరు గ్రామంలో మంగళవారం ఒకటిన్నర గంటల సమయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ఆలయ అభివృద్ధి కోసం ఆరు కోట్ల 70 లక్షల రూపాయల చెక్కులను దేవాదాయ శాఖ అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పంపునూరులో సుబ్రమణ్య స్వామి వారి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు 14 కోట్ల 20 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణం చేపడుతున్నామని అందులో మొదటి విడుతగా 6 కోట్ల 70 లక్షల రూపాయలు నిధులు విడుదల చేయడం జరిగిందని రానున్న రోజుల్లో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.