రాప్తాడు: స్పెషల్ ఏంటి రివిజన్ ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ లో కార్యకర్తలు జాగ్రత్తగా పరిశీలించండి అనంతపురంలో ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లో కళ్యాణదుర్గం రోడ్ లో వివిఎస్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం 11:30 నుంచి రెండున్నర గంటల వరకు ఆత్మకూరు మండలానికి చెందిన టిడిపి నాయకులతో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్ పరిటాల సునీత తదితరులు మాట్లాడుతూ ఈనెల 15 నుంచి కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఓటర్ వెరిఫికేషన్ నిర్వహించబోతున్నారని కావున ప్రతి గ్రామంలోనూ ఓటర్ వెరిఫికేషన్ కార్యకర్తలంతా క్షుణ్ణంగా పరిశీలించాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పరిటాల శ్రీరామ్ తదితరులు ఆత్మకూరు మండలానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలను ఆదేశించారు.