ఉరవకొండ: పట్టణంలోని మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా
అనంతపురం జిల్లా ఉరవకొండ మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. వెలిగొండ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రహరీ గేటు కూలి తీవ్రంగా గాయపడిన చెన్నరాయుడు అనే విద్యార్థికి న్యాయం చేయాలని వైయస్సార్ విద్యార్థి విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు మంజునాథరెడ్డి తదితరులు డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ, పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధికి తక్షణమే చర్యలు చేపట్టాలని విద్యార్థి విభాగం నాయకులు కోరారు. *మీ సాక్షి టీవీ లో...*