రాప్తాడు: నారా లోకేష్ కచ్చగట్టి మా పైన కేసులు పెట్టిస్తున్నాడు అనంతపురంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపణ
అనంతపురం జిల్లా కేంద్రంలో గురువారం 11:15 నిమిషాల సమయంలో రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాపైన కక్షగట్టి మా కుటుంబ సభ్యుల పైన అక్రమ కేసులు పెట్టి మా అన్న తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి కేసులో ఇరికించి అరెస్ట్ చేయించి మాజీ ఎమ్మెల్యే అయినా తనకు కూడా రక్షణ లేకుండా చేయాలని ప్రభుత్వం గన్ మెన్ ను తొలగించడం జరిగిందని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఐటీ శాఖ మంత్రినారా లోకేష్ పై పలు విమర్శలు చేశారు.