ఉరవకొండ: మలేరియా పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి : ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి
మలేరియా నివారణ మన చేతుల్లోనే ఉన్నదని వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే రోగాలు దరి చేరకుండా ప్రజల ఆరోగ్య వంతులుగా ఉంటారని ఉరవకొండ మలేరియా సబ్ యూనిట్ అధికారి బత్తుల కోదండరామిరెడ్డి తెలియజేశారు. మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలని పెద్ద కౌకుంట్ల మరియు రాకెట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని ల్యాబ్ కేంద్రాలను పరిశీలించి ప్రతిరోజు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి రోగులు ఎంతమంది వస్తున్నారు వారిలో జ్వర పీడితులు ఎంతమంది ఉంటున్నారో అందరికీ రక్తపు నమూనాలు సేకరిస్తున్నారు అన్న వివరాలను ల్యాబ్ టెక్నీషియన్లు భవాని మరియు విజయ ప్రసాద్ లను అడిగి తెలుసుకున్నారు.