రాప్తాడు: మేడాపురం గ్రామంలో మొహరం వేడుకల్లో భాగంగా పీర్లను ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన మేడాపురం గ్రామస్తులు
సత్య సాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం మూడున్నర నుంచి ఆరున్నర గంటల వరకు మొహరం వేడుకల్లో భాగంగా పీర్లను ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడాపురం గ్రామానికి చెందిన మురళి గ్రామస్తులు మాట్లాడుతూ మేడాపురం గ్రామంలో మొహరం వేడుకలు ప్రతి ఏడాది కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహిస్తామని ఈ ఏడాది కూడా మొహరం వేడుకల్లో భాగంగా పీర్లను ప్రధాన వీధులు వెంట ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని మేడాపురం మురళి గ్రామస్తులు పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులంతా పాల్గొని సంగీత వైద్యాలకు అనుగుణంగా నృత్యాలను చేశారు.