ఉరవకొండ: పట్టణంలో ఘనంగా బసవేశ్వర జయంతి వేడుకలు
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ కేంద్రంలోని గాంధీ బజార్ లోని శ్రీ పేట బసవేశ్వర స్వామి ఆలయంలో బసవేశ్వర 893 వ జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు బసవేశ్వరుని విగ్రహానికి ప్రత్యేక పూజలు అభిషేకలను నిర్వహించారు. బసవ జయంతి ఉత్సవాల్లో భాగంగా పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గవి మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్ర స్వామి తాసిల్దార్ భోగన్న గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. బసవ జయంతి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.