సంతనూతలపాడు: నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి లో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్
నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ ఉద్యమాలకు పురిటి గడ్డ ఈదుముడిలో పర్యటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అనేది ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడి సాధించుకుంది కాదని, ఉద్యమాల ద్వారా సాధించుకుందన్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా పోరాడి సాధించుకోవాలని సూచించారు.