సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో మైకుల ద్వారా హెచ్చరికలను జారీచేసిన పోలీసులు
చీమకుర్తి పట్టణంలో శనివారం పోలీసులు మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలను జారీ చేశారు. మైనర్లకు తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వవద్దని, అలా ఇస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని, మద్యం తాగి వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా విధిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లు నడిపేవారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అతివేగం ప్రమాదకరమని హెచ్చరించారు.