సంతనూతలపాడు: చీమకుర్తికి చెందిన హోంగార్డ్ చిరంజీవి రావు గుండెపోటుతో మృతి, నివాళులు అర్పించిన హోంగార్డ్స్ ఇన్స్పెక్టర్ సర్వేశ్వరరావు
చీమకుర్తి: ఒంగోలులోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో జనరల్ డ్యూటీ విధులు నిర్వహిస్తున్న చీమకుర్తి పట్టణానికి చెందిన హోంగార్డ్ చిరంజీవి రావు గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. విషయం తెలుసుకున్న హోంగార్డ్స్ ఇన్స్పెక్టర్ సర్వేశ్వరరావు, ఆర్ ఐ రమణారెడ్డి శుక్రవారం హోంగార్డు చిరంజీవి రావు పార్థివ దేహాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంత్యక్రియల నిర్వహణకు కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. హోంగార్డ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు.